![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -189 లో... ధీరజ్ ని తీసుకొని ఇంటికి వస్తాడు రామరాజు. అప్పుడే వాళ్ళు అలా కలిసి రావడం వేదవతి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇద్దరు ఇలా వస్తుంటే ఎంత బాగుందోనని వేదవతి అంటుంది. వాడిని డెలివరి బాయ్ జాబ్ మానేయని చెప్పు వాడి అవసరాలకి.. ఆ డబ్బు అంతా నేను ఇస్తానని చెప్పమని వేదవతితో రామరాజు అంటాడు.
వాడి కాలేజీ తర్వాత మన మిల్ కి రమ్మని చెప్పమని రామారాజు అంటాడు. దాంతో ఒప్పుకోరా అని ధీరజ్ తో వేదవతి అంటుంది. నేను ఒప్పుకోను.. నాకు సొంతంగా కష్టపడడం ఇష్టం.. నేను ఆయన దగ్గర పనిచెయ్యనని ధీరజ్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ మాటలకి ధీరజ్ ని రామరాజు కొడతాడు. ఇవ్వన్నీ సమస్యలకి, వాడిని నేను దూరం పెట్టడానికి కారణం.. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్లే అనగానే ప్రేమ బాధపడుతుంది.
ఆ తర్వాత వేదవతి ఎవరు తగ్గట్లేదంటూ కిచెన్ లోని సామాను అంతా కోపంతో పడేస్తుంది.అప్పుడే ప్రేమ, నర్మద వెళ్తారు. అసలు ధీరజ్ ని ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని ధీరజ్ కి సపోర్ట్ గా ప్రేమ మాట్లాడుతుంది. దాంతో వేదవతి, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతారు. తరువాయి భాగంలో రామరాజు పక్కన ధీరజ్ కూర్చొని భోజనం చేస్తుంటే రామరాజు వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీనంతటికి కారణం నేను.. ప్రేమ, ధీరజ్ ల పెళ్లి చేసాను వెంటనే నేనే వాళ్ళ పెళ్లి జరిపించానని ఆయనతో చెప్పాలనుకుంటింది వేదవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |